దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ జంటగా ప్రేమ్ చంద్ కిలారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్‌పై హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం సినిమా విజయంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకూ 8 సినిమాలు చేశాను. కానీ తొలిసారిగా దర్శకుడిని పూర్తిగా నమ్మి చేసిన సినిమా ఇది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాకు కచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుందనే నమ్మకం నాకుంది” అని తెలిపారు.
దర్శకుడు ప్రేమ్ చంద్ మాట్లాడుతూ, మా నాన్న నాకు దేవుడి కంటే ఎక్కువ, ఆ నాన్ననే ఎదిరించి మరీ ఈ సినిమాను తీస్తున్నానని, కంటెంట్ అంత బలంగా ఉంటుందని పేర్కొన్నారు. మిథున్ ముకుందన్ సంగీతం, అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలని చిత్రబృందం తెలిపింది. మీషా నారంగ్, రాజీవ్ పిళ్లై, భూషణ్ కళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
