
2015లో తెలుగు సినిమా స్థాయిని పెంచి, నేషనల్ స్థాయిలో రికార్డ్స్ సాధించి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా సిద్దమవుతున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా దర్శకధీరుదు రాజమౌళికి ముఖ్య పాత్రలు చేసిన ప్రభాస్,రానా లకి నేషనల్ వైడ్ మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. బాహుబలి అందరినీ షాక్ చేస్తూ కేవలం హిందీ వెర్షన్ తోనే 100కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వస్తున్న మరో పీరియడ్ ఫిల్మ్ ‘భాజీరావు మస్తానీ’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి సూపర్బ్ వచ్చింది.
బాహుబలి రోజులకే ఈ పీరియడ్ ఫిల్మ్ కూడా సిద్దమవుతుండడం వలన అన్ని చోట్లా భాజీరావు మస్తానీ అనే సినిమా కూడా బాహుబలి లానే ఉంటుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ‘భాజీరావు మస్తానికి బాహుబలికి అస్సలు సంబంధం ఉండదు.. అది వేరే తరహా కథ, ఇది వేరే తరహా కథ. రెండింటికి ఉన్న కామన్ పాయింట్ రెండూ పీరియడ్ ఫిల్మ్స్ కావడమే అని’ దీపిక మీడియాతో తెలిపింది. కావున బాహుబలి సినిమాని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని చూడకూడదని దీపిక ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చింది.

