ప్రభాస్ పాత్రకు తగ్గట్లుగానే దీపక పాత్ర కూడా !

Published on Oct 26, 2020 8:20 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత, తన 21వ సినిమాని ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ – దీపిక పదుకొణెల పాత్రలకి సంబంధించి కొత్త టాక్ మొదలైంది. ప్రభాస్ తో పాటు దీపికకి కూడా నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో.. సినిమాలో ప్రభాస్ పాత్రకు తగ్గట్లుగానే దీపక పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని.. కథలో అమెది కూడా ఎంతో కీలక పాత్ర అని తెలుస్తోంది.

ఇక అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాకి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి జనరేషన్ కూడా సింగీతం శ్రీనివాసరావు సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే ఆయనను తమ సినిమాలో భాగం చేశారట వైజయంతి మూవీస్ వారు. కాగా ఈ సినిమా ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా రాబోతుందట. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా నాగ్ అశ్విన్ అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

More