లీక్ అయ్యిన “కల్కి” మరో ట్రైలర్ కోసం డిమాండ్

లీక్ అయ్యిన “కల్కి” మరో ట్రైలర్ కోసం డిమాండ్

Published on Jun 20, 2024 9:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పడుకోణ్ (Deepika Padukone) అలాగే దిశా పటాని హీరోయిన్ గా గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమా దగ్గరకి వస్తున్నా తక్కువ సమయంలో ప్రమోషన్స్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అయితే గత కొన్ని రోజులు కితం వచ్చిన ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ ఈ ట్రైలర్ సమయంలోనే విధంగా మరో ట్రైలర్ అప్పుడు లీక్ అయ్యి షాకిచ్చింది. ఇక ఇప్పుడు ఎలాగో సమయం దగ్గరకి వస్తుంది కాబట్టి అభిమానులు ఆ ట్రైలర్ ఏదో అఫీషియల్ గా వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆల్రెడీ టాగ్స్ కూడా ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే ఈ లీక్ అయ్యిన ట్రైలర్ ఈ రెండు మూడు రావచ్చని వినిపిస్తుంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు