ఈసారి ప్రేమ కథతో రానున్న ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు !

ఈసారి ప్రేమ కథతో రానున్న ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు !

Published on Jun 5, 2018 10:16 AM IST

మొదటి చిత్రం ‘నీది నాది ఒకే కథ’తో ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని మెప్పించిన దర్శకుడు వేణు ఊడుగుల ప్రస్తుతం రెండవ సినిమా పనుల్లో ఉన్నారు. తొలి చిత్రంలో తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ ను చూపించిన ఆయన ఈసారి ప్రేమ కథను రాస్తున్నారు. అది కూడ 90ల బ్యాక్ డ్రాప్లో కావడం విశేషం.

తానింకా స్క్రిప్ట్ రాస్తున్నానని, ఇంకొన్ని నెలల్లో పూర్తవుతుందన్న ఆయన త్వరలోనే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరో అధికారికంగా ప్రకటిస్తానని అన్నారు. రొమాన్స్, పాలిటిక్స్, యాక్షన్ వంటి కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో దండిగా ఉంటాయట. ఇకపోతే శర్వానంద్ తో ప్రస్తుతం ‘పడి పడి లేచె మనసు’ సినిమాను నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని కూడ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు