లేటెస్ట్…రాజమౌళి పై డాక్యుమెంటరీ…నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్!

లేటెస్ట్…రాజమౌళి పై డాక్యుమెంటరీ…నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్!

Published on Jul 5, 2024 10:41 PM IST

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్. జక్కన్న రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB29 చిత్రాన్ని చేసున్నారు. త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రాజమౌళి పై ఒక డాక్యుమెంటరీ వస్తుంది. అప్లాజ్ ఎంటర్ టైన్మెంట్ మరియు అనుపమ చోప్రా దీన్ని రూపొందిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో విజనరీలు అయిన వారిని గుర్తించే విధంగా ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఉండనుంది. దీనికి మోడ్రన్ మాస్టర్స్ అని పేరు పెట్టారు. అయితే రాజమౌళి కి సంబందించిన డాక్యుమెంటరీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 2 వ తేది నుండి ఈ డాక్యుమెంటరీ అందుబాటులోకి రానుంది.

రాజమౌళి విజన్, మేకింగ్ స్టైల్ మరియు తెర వెనుక సినిమా కోసం అతను పెట్టే ఎఫర్ట్స్ ను డాక్యుమెంటరీ లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ కూడా బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ చిత్రాల గురించి కూడా ఉండే అవకాశం ఉంది. ఈ న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్యూరియాసిటి ను క్రియేట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు