టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ అవైటెడ్ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జె్ట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 3న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది ఎపిక్ టూర్’ పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషనల్ టూర్‌ను ప్లాన్ చేసింది. ముంబై, కొచ్చి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని కలుపుకుంటూ సరిహద్దులు దాటిన ప్రమోషన్స్‌కు మేకర్స్ సిద్ధమయ్యారు.
ఈ టూర్ జూన్ 19న హైదరాబాద్‌లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 20న ముంబై, 21న చెన్నై, 22న బెంగళూరు, 23న కొచ్చి నగరాల్లో ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించనున్నారు. జూన్ 26న వారణాసిలో డివోషనల్ టచ్‌తో ‘వీర నాగ’ సాంగ్ లాంచ్, జూన్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్, అలాగే జూలై 2న స్పెషల్ ప్రీమియర్ నైట్ ఉండబోతున్నాయి.
ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, రిషబ్ సాహ్ని, దక్షా నగార్కర్, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ భారీ ప్యాన్-ఇండియా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


