జనవరి 25న రానున్న దేవ్ ?

జనవరి 25న రానున్న దేవ్ ?

Published on Nov 19, 2018 12:00 PM IST

‘చినబాబు’ తరువాత తమిళ హీరో కార్తీ నటిస్తున్న చిత్రం ‘దేవ్’. తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ఖరారు అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తిసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ దర్శకత్వంలో అడ్వెంచర్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది . హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సుమారు 50కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు