‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటో నగర్ సూర్య’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు దేవా కట్టా. ముఖ్యంగా దేవా కట్టా డైలాగులకు సర్వత్రా ప్రసంశలు లభిస్తున్నాయి. అఖిల్, గోపీచంద్ లలో ఎవరో ఒకరు హీరోగా సినిమా ఉండొచ్చు అంటూ ‘ఆటో నగర్ సూర్య’ తర్వాత దేవా కట్టా దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రం గురించి పలు వార్తలు వస్తున్నాయి.
అయితే దేవా కట్టా తదుపరి సినిమా ఇంకా ఖరారు కాలేదంట. ‘ ప్రస్తుతం రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్ అయిన తర్వాత మీకు తెలియజేస్తాను ‘ అంటూ ట్విట్ చేశారు.



