నైజాంలో భారీ ధరకు అమ్ముడైన ‘దేవదాస్’ హక్కులు !

Published on Sep 2, 2018 12:55 pm IST

అగ్ర హీరో నాగార్జున , నాని లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ దేవదాస్ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. భలే మంచి రోజు ఫెమ్ శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా , నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ ఈచిత్రానికి సంగీతం అందిస్తుండగా రష్మిక, ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సినిమాస్ విడుదలచేయనుంది. అందుకుగాను ఈ చిత్ర హక్కులను రూ.11.07కోట్ల కు దక్కించుకున్నారు ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్. ఇక ఈ చిత్ర కర్ణాటక హక్కులను బృంద అసోసియేట్స్ మంచి రేటుకు దక్కించుకుంది. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 27 న పేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :