వాయిదా పడిన ‘దేవదాస్‌’ సాంగ్, ‘పందెంకోడి 2’ టీజర్ !

వాయిదా పడిన ‘దేవదాస్‌’ సాంగ్, ‘పందెంకోడి 2’ టీజర్ !

Published on Aug 29, 2018 2:03 PM IST

devadas pandem kodi2
నందమూరి హరికృష్ణగారి మరణం కారణంగా ఇటు చిత్ర పరిశ్రమ అటు రాజకీయ రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. కాగా హరికృష్ణగారి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు రిలీజ్ కావాల్సిన నాగార్జున, నాని ‘దేవదాస్‌’ చిత్రంలోని సాంగ్ ని, విశాల్ ‘పందెంకోడి 2’ సినిమా టీజర్‌ను హరికృష్ణ మృతికి నివాళిగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయా చిత్ర బృందాలు తెలుపుతూ.. హరికృష్ణగారి కుటుంబానికి సానుభూతి ప్రకటించాయి.

కాగా ‘దేవదాస్‌’ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. అశ్వినీదత్ కి హరికృష్ణతో మంచి అనుబంధం ఉంది. హీరో విశాల్‌ జన్మదినం సందర్భంగా ‘పందెంకోడి 2’ ప్రచార చిత్రాల్ని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించినప్పటికీ హరికృష్ణగారి అకాల మరణం కారణంగా వాటిని వాయిదా వేశారు.

తాజా వార్తలు