నాగార్జున , నాని ల దేవదాస్ చిత్రం యొక్క టీజర్ రేపు సాయంత్రం 5గంటలకు విడుదల కానుంది. భలే మంచి రోజు ఫెమ్ శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ దాదాపు గా పూర్తయింది. ఈ చిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా , నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడు
కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాగ్ కు జోడిగా ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా నాని సరసన రష్మీక నటిస్తుంది. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27 న ఈచిత్రం పేక్షకుల ముందుకు రానుంది.


