ఈ ఇద్దరిపై మోషన్ పోస్టర్ తోనే ఆసక్తి రేపిన దేవ కట్ట.!

Published on Aug 14, 2020 10:07 am IST

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్ట ఈ మధ్యనే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయ వర్గాల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు లెజెండరీ రాజకీయ నాయకులు దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల స్నేహ బంధంపై తాను తెరకెక్కించునన్న వెబ్ సిరీస్ కు సంబంధించి మరో దర్శకుడు కాపీ చేసాడని ఆరోపించి హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాను అనౌన్స్ చేసిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మోషన్ పోస్టర్ టీజర్ ఇపుడు బయటకొచ్చింది.

“ఇంద్రప్రస్థం” అనే వర్కింగ్ టైటిల్ తో విడుదలైన ఈ టీజర్ ఆసక్తి రేపుతోంది. “ప్రపంచంలో జరిగే ఎన్నో పోటీలలో గెలుపే పరమావధి అని తెలిసిందే. కానీ అదే గెలుపు పోటీలో ఇద్దరు స్నేహితులు ఉంటే?” ఎలా ఉంటుంది అన్న పాయింట్ మీద రిలీజ్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంది అని చెప్పాలి. వైఎస్సార్ మరియు చంద్రబాబుల స్నేహబంధం, వారి ప్రయాణంపై ఇన్స్పైర్ అయ్యి దేవ కట్టా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తుండగా హర్ష వి మరియు తేజ సి లు ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. మరి ఈ పొలిటికల్ డ్రామా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More