బాలయ్య విలన్ పై కీలక సన్నివేశాలు

బాలయ్య విలన్ పై కీలక సన్నివేశాలు

Published on Apr 28, 2024 6:07 PM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, దేవర: పార్ట్ 1లో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ప్రస్తుతం షైన్ టామ్ చాకో పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. షైన్ టామ్ చాకో విలన్ పాత్రలోనే నటిస్తున్నాడు. అన్నట్టు బాలయ్య ప్రస్తుతం రాజకీయ ప్రచారాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ కి దూరంగా ఉన్నాడు.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు