పవర్ ఫుల్ పోస్టర్ తో “దేవర” సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

పవర్ ఫుల్ పోస్టర్ తో “దేవర” సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jun 13, 2024 5:42 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర(Devara). ఈ చిత్రం ను అక్టోబర్ 10, 2024 న రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ ను ప్రీ పోన్ చేస్తూ, అధికారికంగా సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 27, 2024 న భారతీయ ప్రధాన భాషల్లో దేవర చిత్రం రిలీజ్ కానుంది.

ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఎన్టీఆర్ బ్యాక్ పోజ్ లో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు