కేరళ వాసులకోసం దేవరకొండ సాయం !

కేరళ వాసులకోసం దేవరకొండ సాయం !

Published on Aug 12, 2018 3:40 PM IST

Vijay Devarakonda

ఇటీవల కురిసిన వర్షాలతో అతలాకుతలం అవుతున్న దక్షిణాది రాష్ట్రం కేరళ ను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొస్తున్నారు . దాంట్లో భాగంగా సెన్సషనల్ యువ హీరో విజయ్ దేవరకొండ రూ.5 లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఇక నిన్న వరద బాధితుల సహాయార్థం తమిళ స్టార్ హీరోలు అన్నదమ్ములు సూర్య, కార్తీ రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇంతకుముందు తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేసి తద్వారా వచ్చిన రూ. 25 లక్షలను తెలంగాణ ముఖ్య మంత్రి సహాయ నిధి కి విరాళం ఇచ్చి ప్రజల మనుసును గెలుచుకున్నాడు విజయ్ దేవరకొండ.

తాజా వార్తలు