వినూత్నంగా ప్రమోషన్లు మొదలుపెట్టిన దేవరకొండ !


విజయ్ దేవరకొండ నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్ర విడుదల తేదీ మే 18 దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. అందులో భాగంగానే వినూత్నమైన కాన్సెప్ట్ తో డ్రీమ్ బిహైండ్ టాక్సీవాలా పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేసింది.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత తన వద్ద నాలుగు సినిమా స్క్రిప్ట్స్ ఉన్నాయని, వాటిలో ఏది చూజ్ చేసుకోవాలో తెలియలేదని, కానీ ఒకరోజు రాత్రి నలుగురు ఆకతాయి పిల్లలు తన కలలోకి వచ్చి తన కోసం టాక్సీవాలా స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేశారని, ఈ సినిమాను తాను చేయడం వెనుక ఉన్న అసలు కారణం అదేనని అంటూ ఆ విషయాన్నే వీడియోగా చేసి రిలీజ్ చేశారు.

వీడియో కంటెంట్ కూడ వెరైటీగా అనిపిస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు నటించారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :

Exit mobile version