‘డియర్ కామ్రేడ్’ అంటున్న విజయ్ దేవరకొండ !

‘డియర్ కామ్రేడ్’ అంటున్న విజయ్ దేవరకొండ !

Published on May 8, 2018 1:14 PM IST

సూపర్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డియర్ కామ్రేడ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను నిర్ణయించారు. రేపు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.

‘డియర్ కామ్రేడ్’ అనే కమ్యూనిజం కంటెంట్ ఉన్న సినిమా అనుకుంటే పొరపాటే. ఇదొక పూర్తిస్థాయి లవ్ స్టోరీలా ఉంటుందట. కాకినాడ నేపథ్యంలో జరిగే ఈ కథలో దేవరకొండ కాకినాడ యాసలోనే మాట్లాడనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు