నాగార్జున నాని ల కలయికలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ నిన్న విడుదలై కు మంచి రెస్పాన్స్ వస్తుంది. చిత్రం పూర్తిగా కామెడీ నేపథ్యంలో ఉండనుందట . రౌడీ పాత్రలో నాగ్, డాక్టర్ పాత్రలో నాని కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్క అని సమాచారం.
రష్మిక, ఆకాంక్ష సింగ్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ చలసాని నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్ వీకె , వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకులముందుకు రానుంది.


