అఖిల్ 4 కి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !

అఖిల్ 4 కి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !

Published on Apr 1, 2019 10:32 AM IST

dsp1

హ్యాట్రిక్ పరాజయాల తరువాత యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసే పనిలో వున్నాడు. అయితే ఈ సారి కూడా స్టార్ డైరెక్టర్ ను కాకుండా రేస్ లో లేని డైరెక్టర్ తో తన తదుపరి సినిమా చేయనున్నాడు. ఆయన ఎవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు , పరుగు సినిమా లతో హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు ఆ తరువాత ఆరెంజ్ , ఒంగోలు గిత్త తో పరాజయాలను చవి చూశాడు . ఇక వీరిద్దరికి బ్లాక్ బ్లాస్టర్ విజయం అవసరం కానుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు డైరెక్టర్. త్వరలోనే ఈ చిత్రం లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ప్లాన్లో ఉందట చిత్ర యూనిట్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు