సర్ప్రైజ్ తో “జల్సా” రోజుల్లోకి తీసుకెళ్ళిపోయిన దేవిశ్రీ.!

Published on Sep 2, 2021 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ఈరోజు కావడంతో అభిమానులు సందడి చేసుకుంటుండగా సినీ వర్గాలు సహా రాజకీయ వర్గాల నుంచి పవన్ కి శుభాకాంక్షలు నిన్నటి నుంచి వెల్లువెత్తుతున్నాయి. మరి ఇదిలా ఉండగా పవన్ బర్త్ డే కి స్పెషల్ ట్రీట్ గా పలువురు సినీ ప్రముఖులు ఊహించని బహుమానాలు కూడా అభిమానులకు అందిస్తున్నారు.

అలా టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఒక ఊహించని సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన “జల్సా” సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు.. ఇంకా పాటల కోసం అయితే ఆ ఆల్బమ్ అప్పట్లో ఒక సెన్సేషన్. మరి మళ్ళీ ఇప్పుడు జల్సా రోజుల్లోకి దేవీ తీసుకెళ్లాడు.

పవన్ బర్త్ డే కానుకగా ఒక స్పెయిల్ వీడియో ఉందని చెప్పి అప్పట్లోనే ఈ సినిమా కోసం డిజైన్ చేసిన స్పెషల్ ప్రమోషనల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడు పలు కారణాల చేత ఆ వీడియోని రిలీజ్ చెయ్యలేకపోయాం ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాత అల్లు అరవింద్ ల చొరవతో రిలీజ్ చేస్తున్నామని దేవి జల్సా టైటిల్ ట్రాక్ తో తన ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ఆ సాంగ్ ని చూడకుంటే ఈ క్రింద పొందుపరిచాం చూడొచ్చు..

వీడియో సాంగ్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :