అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం’ దఢక్’ జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తో బాక్సాఫిస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం వారం రోజులకు గాను దేశవ్యాప్తంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. అటు ఓవర్సీస్లో కూడా ఈచిత్రం మంచి వసూళ్లనే రాబట్టుకుంటుంది.
మరాఠి భాషలో విజయం సాధించిన ‘సైరాత్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాతలు అపూర్వ మెహతా, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఇషాన్ కట్టర్ హీరో గా నటించాడు.


