సాలిడ్ ధరకి “ధమాకా” హిందీ రైట్స్.?

Published on Dec 15, 2022 2:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. మరి సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం మళ్ళీ రవితేజ వింటేజ్ మోడ్ ని చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే రవితేజ సినిమాలకి మన తెలుగుతో పాటుగా హిందీ మార్కెట్ లో కూడా మంచి ఆదరణ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

మరి అలా ఇప్పుడు ధమాకా చిత్రానికి గాను సాలిడ్ ధర పలికినట్టుగా కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి వీటి ప్రకారం అయితే హిందీ డబ్బింగ్ హక్కులు ఏకంగా 20 కోట్లకి పైగానే పలికినట్టుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఇది రవితేజ కెరీర్ లో మరో హైయెస్ట్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉండగా ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ 23 రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :