యూఎస్ లో “ధమాకా” మాస్ యుఫోరియా.!

యూఎస్ లో “ధమాకా” మాస్ యుఫోరియా.!

Published on Dec 25, 2022 12:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా”. రవితేజ డ్యూయల్ షేడ్స్ లో నటించిన ఈ చిత్రం మొదటి రోజే రవితేజ కెరీర్ మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇక మొదటి రోజు మంచి టాక్ తో మరింత పికప్ అయ్యిన ఈ చిత్రం వీకెండ్ లో రెండో రోజు కూడా అదరగొట్టినట్టుగా తెలుస్తుంది.

మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది. మరి ఈ చిత్రం అయితే యూఎస్ లో మార్కెట్ లో ప్రీమియర్స్ సహా మొదటి రెండు రోజుల్లో లక్ష 50 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకొని స్ట్రాంగ్ గా రన్ ని కొనసాగిస్తుంది. దీనితో తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మాస్ మహారాజ్ మాస్ యుఫొరియా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు