“పుష్ప” లో జాలీ రెడ్డి గా కనిపించనున్న ధనంజయ!

Published on Aug 23, 2021 7:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలు గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైస్ అంటూ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం చిత్ర యూనిట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, వీడియో లు, ఫస్ట్ సింగిల్ సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఐదు బాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం లో విలక్షణ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ మరొక కీలక అప్డేట్ ను ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం లో ప్రముఖ కన్నడ నటుడు ధనంజయ జాలీ రెడ్డి పాత్ర కో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటికి రావడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ కి కన్నడ, మళయాళ భాషల్లో ఇప్పటికే క్రేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న నటులు ఈ చిత్రం లో భాగం అవ్వడం తో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో ఈ చిత్రం కథ కొనసాగనుంది.

సంబంధిత సమాచారం :