షూటింగ్లో గాయపడిన హీరో ధనుష్ !
Published on Jun 23, 2018 11:00 am IST

2015లో ధనుష్ హీరోగా రూపొందిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడ ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటుండగా ధనుష్ కు ప్రమాదం ఏర్పడింది.

ఈ ప్రమాదంలో ఆయన కుడి మోకాలు, ఎడమ చేతికి బలమైన గాయాలైనట్టు తెలుస్తోంది. దెబ్బలు తగిలినా కూడ ధనుష్ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తిచేశారట. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. దర్శకుడు బాలాజీ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook