పిక్ టాక్ : షూటింగ్ సెట్స్‌లో మమ్ముట్టి ‘పద్మభూషణ్’ సెలబ్రేషన్స్ జరిపిన ధనుష్..!

పిక్ టాక్ : షూటింగ్ సెట్స్‌లో మమ్ముట్టి ‘పద్మభూషణ్’ సెలబ్రేషన్స్ జరిపిన ధనుష్..!

Published on Jun 25, 2026 7:31 PM IST

తమిళ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘ఓం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చత్రాన్ని ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మమ్ముట్టిని ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధనుష్ ‘ఓం’ సినిమా షూటింగ్ సెట్స్‌లోనే కేక్ కటింగ్ చేసి ఈ స్పెషల్ క్షణాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

గోపురం ఫిలిమ్స్ బ్యానర్‌పై అన్బుచెలియన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు