తమిళ సినిమా నటుడు ధనుష్ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకునే పనిలో వున్నాడు. అతని నటనా పటిమకు ఎటువంటి వంకలూ పెట్టలేమన్నది తెలిసిన విషయమే. ధనుష్ యాక్టింగ్ వైపే కాక సోషల్ నెట్వర్కింగ్ వైపు కూడా యాక్టీవ్ గా అడుగులు వేస్తున్నాడు. అతని అధికార ట్విట్టర్ అకౌంట్ కి 10లక్షల మంది ఫాలోవర్లు వున్నారు. ఒక సౌత్ స్టార్ కి ఈ రేంజ్ ఫాలోయింగ్ అంటే గ్రేట్ అనే చెప్పాలి
‘వై దిస్ కొలవెరి డి’ పాటతో ధనుష్ కి మంచి గుర్తింపు లభించింది. త్వరలో ధనుష్ అమితాబ్ తో కలిసి షమితాబ్ సినిమాలో కనిపించనున్నాడు. తను ఇలానే కెరీర్ లో తారాపదానికి ఎదగాలని కోరుకుందాం


