అజిత్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం ఈ రోల్ లో ధనుష్.?

అజిత్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం ఈ రోల్ లో ధనుష్.?

Published on Dec 24, 2022 4:30 PM IST

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు హీరోగా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో తమిళ్ చిత్రాలతో పాటుగా పలు పాన్ ఇండియా సబ్జెక్టు లు కూడా ధనుష్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల బిజీ లో కూడా ధనుష్ మరిన్ని సినిమాలు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో తాను ఓకే చేసేస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో “తునివు”, “వలిమై” లాంటి సాలిడ్ యాక్షన్ చిత్రాలు చేసిన హెచ్ వినోద్ తో అయితే ఓ సినిమాని ఓకే చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తుండగా ఈ చిత్రంలో ధనుష్ మొదటి సారిగా ఇప్పటి వరకు తాను చేయని ఫస్ట్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి తమిళ సినీ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం అయితే ధనుష్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడట. అలాగే ఈ చిత్రం అయితే కొన్ని నిజ జీవిత సంఘటనల ద్వారా చేయనున్నట్టుగా కూడా టాక్. మరి ఈ ప్రాజెక్ట్ పై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు