చివరి దశకు చేరిన మారి 2 చిత్రీకరణ !

చివరి దశకు చేరిన మారి 2 చిత్రీకరణ !

Published on Jun 26, 2018 8:00 PM IST

Dhanush

2015 లో తమిళ స్టార్ హీరో ధనుష్ , కాజల్ జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మారి. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం మారి 2. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి కథనాయికాగా నటిస్తున్నారు. ఈచిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది ఇంకా ఒక్క సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి వుంది .

ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ పతాకం ఫై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక సాయి పల్లవి ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుంది . వరలక్ష్మి శరత్ కుమార్ ,విద్య , రోబో శంకర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు