మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా?

Published on Jun 30, 2021 3:00 am IST


కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఇప్పటివరకు డైరెక్ట్‌గా తెలుగు సినిమాని కానీ, తెలుగు దర్శకులతో కానీ సినిమా చేయలేదు. అయితే ఇటీవల తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ధనుష్ మరో తెలుగు సినిమాను ఒకే చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.

వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించే ఈ మూవీ శేఖర్ కమ్ముల సినిమా కంటే ముందే సెట్స్పైకి వెళ్లనుందట. ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కించబోతున్నారని టాక్. అయితే దీనిపై త్వరలోనే పూర్తి వివరాలతో అధికార ప్రకటన రానుందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సాహో దర్శకుడు సుజీత్ కూడా ధనుష్‌కి ఓ కథ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది కానీ దీనిపై కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ప్రస్తుతం ధనుష్ కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :