దుమ్ము లేపుతున్న కమల్ హాసన్ రెండో కూతురు

దుమ్ము లేపుతున్న కమల్ హాసన్ రెండో కూతురు

Published on Aug 12, 2014 4:50 PM IST

dhanush-akshara-hassan
కమల్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ మంచి నటిగా గురింపు సొంతం చేసుకుంది. ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ సినిమాలతో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. మాస్ పాటలకు శృతి వేసిన స్తేప్పులను అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే అక్కకు ఏమాత్రం తీసిపోను అంటుంది చెల్లెలు అక్షర హాసన్. కమల్, సారికల వారసత్వం కొనసాగిస్తూ నటిగా మారుతున్న సంగతి తెలిసిందే.

‘రాంఝానా’ చిత్రంలో హిందీలో అడుగుపెట్టిన రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఫస్ట్ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. సెకండ్ మూవీగా ఆర్ .బాల్కీ దర్శకత్వంలో ‘షమితాబ్’ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షర హాసన్ హీరోయిన్. ధనుష్, అక్షరలపై తాజాగా ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లు డాన్స్ ఫ్లోర్ దుమ్ము లేపుతున్నారట. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. పాటలో ధనుష్, అక్షరలు డాన్సు ఇరగదీస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు.

తాజా వార్తలు