సెన్సార్ పనులు ముగించుకున్న ‘కర’.. లెంగ్తీ రన్‌టైమ్‌తో వస్తున్న ధనుష్..!

సెన్సార్ పనులు ముగించుకున్న ‘కర’.. లెంగ్తీ రన్‌టైమ్‌తో వస్తున్న ధనుష్..!

Published on Apr 28, 2026 8:02 PM IST

ధనుష్ హీరోగా, దర్శకుడు విఘ్నేష్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న క్రైమ్ యాక్షన్ డ్రామా ‘కర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 30న తమిళం మరియు తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ చిత్రం తెలుగు వెర్షన్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకునేలా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 41 నిమిషాలుగా లాక్ చేశారు. కాస్త లెంగ్తీ అయినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ప్రస్తుతం తెలుగులో ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నప్పటికీ, తమిళంలో మాత్రం మంచి బజ్ నెలకొంది. విడుదల తర్వాత వచ్చే మౌత్ టాక్‌పైనే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు