‘కర’ టీజర్ టాక్ : ఇంటెన్స్ యాక్షన్‌తో వస్తున్న ధనుష్..!

‘కర’ టీజర్ టాక్ : ఇంటెన్స్ యాక్షన్‌తో వస్తున్న ధనుష్..!

Published on Apr 24, 2026 8:04 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కిస్తున్న పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, తాజాగా ఈ చిత్ర తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్‌ను గమనిస్తే.. ధనుష్ మరోసారి ప్యూర్ మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. మేకర్స్ కథను రివీల్ చేయకుండా కేవలం విజువల్స్ మరియు ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే ఆసక్తిని రేకెత్తించారు. ముఖ్యంగా సినిమా కలర్ టోన్ మరియు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ మరియు థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. మరి ‘కర’ చిత్రంతో ధనుష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు