ధనుష్ దర్శకత్వంలో నాగార్జున ?

Published on May 30, 2018 3:05 pm IST

కింగ్ నాగార్జున తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో నటించనున్నాడని ఈ మధ్యన వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపై ఇప్పటికీ అధికారిక ధృవీకరణ లేదు. అయితే నాగార్జున ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుష్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం నాగార్జున ఆర్జీవీ దర్శకత్వంలో నటించిన ‘ఆఫీసర్’ చిత్ర ప్రమోషనల్ లో బిజీగా ఉన్నారు. జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

ఈ సినిమా కాకుండా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి మల్టీస్టారర్లో నటిస్తున్నారు నాగ్. బహుశా దీని తరువాత ధనుష్ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉండొచ్చు. ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ చిత్రం కూడా చేయాలని ఉందని కానీ ఆ సినిమా ఎప్పుడు మొడులుపెడతామో తెలియదని నాగ్ గతంలోనే వివరించారు .

సంబంధిత సమాచారం :