ధనుష్ 40వ చిత్ర లేటెస్ట్ అప్డేట్

Published on Nov 8, 2019 2:00 am IST

తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ సుబ్బరాజ్, వెర్సెటైల్ హీరో ధనుష్ మొదటిసారి ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ 40వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఓ వినూత్న కథాంశంతో దర్శకుడు సుబ్బరాజ్ తెరకెక్కిస్తుండగా సినిమా మొత్తం యూకే లో చిత్రీకరించారు. దాదాపు 64రోజుల పాటు నిరవధికంగా యూకే లోని విభిన్న ప్రాంతాలలో ఈ చిత్రం తెరకెక్కించారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించాల్సి ఉండగా ‘ఉలగం సుత్త్రుమ్ వాలీబన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రంలో ధనుష్ సరసన ఐశ్వర్య లేక్ష్మి నటిస్తుండగా వై నాట్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చిత్రం విడుదల చేసే అవకాశం కలదు. ఇటీవల దర్శకుడు వెట్రి మారన్ తెరకెక్కించిన అసురన్ చిత్రంలో ధనుష్ నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, తెలుగు మరియు హిందీ భాషలలో రీమేక్ కానుంది.

సంబంధిత సమాచారం :

X
More