ధనుష్ సినిమా ఓటీటీలో రికార్డ్ సెట్ చేస్తోందా ?

Published on Jun 3, 2021 8:04 pm IST

తమిళ హీరో ధనుష్ కొత్త సినిమా ‘జగమే తంత్రం’ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేట్టా’ చిత్రాన్ని తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు.

కథ విషయానికి వస్తే.. తమిళనాడు నుంచి లండన్ కి వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ అట ఇది, మాఫియా లీడర్ గా ధనుష్ పూర్తిగా కొత్త నటన చూపించబోతున్నాడు. ధనుష్ గెటప్ అండ్ లుక్స్ కూడా సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమా ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా పై ఎలాగూ భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి, వ్యూస్ పరంగా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :