ధనుష్ “రాయన్” రన్ టైమ్ ఫిక్స్!

ధనుష్ “రాయన్” రన్ టైమ్ ఫిక్స్!

Published on Jul 7, 2024 10:01 PM IST

ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్. ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో 50 వ చిత్రంగా తెరకెక్కింది. జూలై 26, 2024 న వరల్డ్ వైడ్ గా ధియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిపోయిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రన్ టైమ్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, రాయన్ 140 నిమిషాల (2 గంటల 20 నిమిషాలు) నిడివి ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. SJ సూర్య, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు జయరామ్‌లతో సహా ఈ చిత్రంలో స్టార్ తారాగణం ఉన్నప్పటికీ, వ్యవధి తక్కువగా ఉంచబడింది.

కంటెంట్ ఆశాజనకంగా ఉంటే ఈ రన్‌టైమ్ ఖచ్చితంగా చిత్రానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బహుముఖ నటుడు ఎస్‌జె సూర్య మాట్లాడుతూ, ఈ కథ ఉత్తర మద్రాసు నేపథ్యంలో సాగుతోంది. ధనుష్‌కి హ్యాట్సాఫ్. రామాయణం, మహాభారతాలకు సమానమైన కొన్ని ముఖ్యమైన అంశాలను ఆయన పొందుపరిచారు, ఈ చిత్రంను 2 గంటల 20 నిమిషాల్లోనే నరేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. రాయన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ బ్యాంక్రోల్ చేశారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు