ధరమ్ తేజ్, కరుణాకరన్ సినిమా షూటింగ్ అప్డేట్ !

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కు ‘తొలిప్రేమ’ లాంటి క్లాసిక్ ను అందించిన దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇది వరకే షూటింగ్ మొదలుపెట్టుకొని డిసెంబర్లో 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది.

జనవరి నెల మొత్తం ధరమ్ తేజ్ వినాయక్ తో చేసిన ‘ఇంటిలిజెంట్’ షూటింగ్, విడుదల పనుల్లో బిజీగా ఉండటంతో బ్రేక్ తీసుకున్న ఈ చిత్ర యూనిట్ ఈ ఫిబ్రవరి 16, 17 తేదీల నుండి రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావ్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ‘ఇంటిలిజెంట్’ చిత్రం రేపు 9వ తేదీన రిలీజ్ కానుంది.