క్రైమ్ థ్రిల్లర్ లో నటించబోతున్న మెగా హీరో !
Published on Feb 20, 2018 4:48 pm IST

‘ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, సాహసం’ వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగునాట మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. ఇటీవల మనమంతా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్ త్వరలో తన కొత్త సినిమాను స్టార్ట్ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నాడు.

తాజాగా ఈ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ తో సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. పకడ్బందీ కథకథనాలతో, కొత్త తరహా చిత్రీకరణతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చంద్ర శేఖర్ ఏలేటి ఈసారి సాయి ధరమ్ తో క్రైమ్ థ్రిల్లర్ సినిమా చెయ్యబోతున్నాడు . కరుణాకరన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సాయి ఈ సినిమా పూర్తి అయ్యాక ఏలేటి సినిమా మొదలుపెట్టబోతున్నాడు.

 
Like us on Facebook