ధోనీ వెర్షన్ లో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్..!

Published on Sep 19, 2021 8:34 pm IST

ఐపిఎల్ 2020 మళ్ళీ మొదలు కానుంది. ఈ మేరకు మాజి టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమానులు ధోనీ పై ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం నుండి విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మొదటి పాట భారీ వ్యూస్ రాబట్టడం మాత్రమే కాకుండా, ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకున్న పాట గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఈ మేరకు ఈ పాట తో ధోనీ వెర్షన్ లో భీమ్లా నాయక్ వీడియోస్ ను తయారు చేస్తూ, సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ అవుతూ ఉండటం తో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక వీడియో పై కామెంట్స్ చేయడం జరిగింది. ధోనీ ఎడిషన్ తనకు చాలా బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :