తమిళ “అర్జున్ రెడ్డి” గా ధృవ్, విజయ్ ని మరిపించాడుగా

Published on Jun 16, 2019 4:05 pm IST

స్టార్ హీరో విక్రమ్ కుమారు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “ఆదిత్య వర్మ”. తెలుగు సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీకి తెలుగు అనువాదంగా తెరకెక్కుతుంది. ఈ రోజు ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ నిమిషం నిడివి కలిగిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.కానీ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ టీజర్ ని మక్కీ మక్కి దించేసినట్లున్నారు.దాదాపు విజయ్ దేవరకొండను మరిపించడానికి ప్రయత్నించిన హీరో ధృవ్ కొంతవరకు విజయం సాధించాడు. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న గిరీశాయ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి ఎటువంటి మార్పులు చేయలేదని తెలుస్తుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ వివిధ కారణాలతో చిత్రీకరణ ఆలస్యం ఐయ్యింది.

ధృవ్ కి జోడిగా బనిత సందు నటిస్తున్న ఈ మూవీని ఈఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవి కె చంద్రన్ నిర్మిస్తున్నారు.’అర్జున్ రెడ్డి’ కి మ్యూజిక్ అందించిన రాధన్ “ఆదిత్య వర్మ”కు కూడా సంగీతం సమకూరుస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More