ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధృవ్ సార్జా యాక్షన్ బ్లాస్ట్ ‘కేడీ ది డెవిల్’

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధృవ్ సార్జా యాక్షన్ బ్లాస్ట్ ‘కేడీ ది డెవిల్’

Published on Jun 5, 2026 10:00 AM IST

కన్నడ యాక్షన్ హీరో ధృవ్ సార్జా హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘కేడీ ది డెవిల్’. ఒక భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం కన్నడలో ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది కానీ తెలుగులో మాత్రం ప్లాప్ గానే నిలిచిపోయింది. ఇలా ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి లోకి వచ్చేసింది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు పాపులర్ సంస్థ జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి ఇందులో కేడీ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. భారీ సెట్టింగ్ లు మాస్ యాక్షన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ సినిమాలో అనవసర ఓవర్ ఎలిమెంట్స్ కూడా బాగా యాడ్ చేయడం వల్ల ఆడియెన్స్ కి అంతగా ఎక్కలేదు. కానీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోల్ మాత్రం పీక్ ఎక్స్ పీరియన్స్ ని థియేటర్లు లో అందించింది.

ఇలా కొన్ని మూమెంట్స్ బాగుంటే కొన్ని దారుణంగా సినిమాలో డిజప్పాయింట్ చేసాయి. సో ఈ సినిమాని ఓటిటిలో చూడాలి అనుకుంటే జీ 5 లో కన్నడతో పాటుగా తెలుగు కూడా స్ట్రీమింగ్ అవుతుంది చూడొచ్చు. ఇక ఈ సినిమాకి ప్రేమ్ దర్శకత్వం వహించగా కిచ్చా సుదీప్ విలన్ క్యామియో రోల్ చేశారు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు