మన టాలీవుడ్ వరుస విజయాల చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక్క తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తమదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఇలా కోలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్స్ అందుకుంటూ వెళుతున్న తమ నుంచి చాలా కాలంగా యంగ్ హీరో ధృవ్ విక్రమ్ కలయికలో సినిమా కోసం వింటూనే ఉన్నాము. ఇక ఫైనల్ గా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ తాజాగా అందించారు.
దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ తో ‘జాకీ’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ ని తీసుకొస్తున్నట్టుగా సాలిడ్ యాక్షన్ పోస్టర్ ని ఇప్పుడు విడుదల చేశారు. తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడం విశేషం. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కూడా సినిమా ఉండేలా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.
