‘ధృవ’ ట్రైలర్ సందడి మొదలైపోయింది..!

‘ధృవ’ ట్రైలర్ సందడి మొదలైపోయింది..!

Published on Nov 24, 2016 9:32 PM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తే, ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకొని దూసుకుపోతోంది. ఇక రేపు (నవంబర్ 25న) థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించడంతో అభిమానులంతా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టేశారు.

రేపు సాయంత్రం 7 గంటలకు గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్ చానల్లో ధృవ ఆడియో విడుదలవుతుంది. ఇక ట్రైలర్ విడుదలకు ఇంకా 20 గంటలే ఉండడంతో అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. DhruvaTrailer అన్న ట్యాగ్ ఇప్పటికే ఆన్‌లైన్‍లో ట్రెండ్ అవుతూ వస్తోంది. స్టార్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.

తాజా వార్తలు