రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్‌గా దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, అద్భుతమైన వసూళ్లను రాబడుతూ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. కేవలం వీకెండ్‌లోనే కాకుండా, వర్కింగ్ డేస్‌లో కూడా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతుండటం ఈ సినిమా సత్తాను చాటుతోంది.
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం సరికొత్త రికార్డు అందుకుంది. ఎటువంటి సెలవు దినం లేకపోయినప్పటికీ, ఫస్ట్ మండే రోజే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఓపెనింగ్ వీకెండ్‌లో 10 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, మంగళవారం నాటికి 1.5 మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటంతో అక్కడ రణ్‌వీర్ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇండియాలో కూడా ‘ధురంధర్’ తన పట్టును నిలబెట్టుకుంది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.


