ధురంధర్ 2 ర్యాంపేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్..!

Dhurandhar 2

రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “ధురంధర్: ది రివెంజ్” ట్రైలర్ నిన్న విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ట్రైలర్‌తో పాటే ప్రీమియర్ షో టికెట్ల బుకింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

​ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే, బుక్ మై షోలో బుకింగ్స్ మొదలైన కొద్ది సేపట్లోనే కేవలం ప్రీమియర్ షోల కోసమే 86,680 కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. సినిమాను అందరికంటే ముందే చూడాలనే ఆత్రుత ప్రేక్షకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాక ఈ నంబర్లు మరిన్ని రికార్డులను తిరగరాస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

​మొదటి భాగం కంటే ఈ సీక్వెల్ మరింత వయలెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ మరియు ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

Exit mobile version