టాలీవుడ్ లోకి ‘ధురంధర్’ దర్శకుడు.. రేస్ లో ఈ ఇద్దరే స్టార్స్..?

టాలీవుడ్ లోకి ‘ధురంధర్’ దర్శకుడు.. రేస్ లో ఈ ఇద్దరే స్టార్స్..?

Published on Feb 18, 2026 1:02 AM IST

Adhitya dhar

ఇటీవల బాలీవుడ్ సినిమాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చి దర్శకుడు ఆదిత్య ధర్ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. సింపుల్ అంచనాలు నడుమ వచ్చిన తన ధురంధర్ (Dhurandhar) చిత్రం పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కాకుండానే ఆ రేంజ్ సంచలనం సెట్ చేసింది. అయితే ఈ ఒక్క సినిమాతో అసలు ఈ దర్శకుడు ఎవరు అని కూడా చాలా మంది వెతికేసారు. ఇక ఈ సెన్సేషనల్ ఇప్పుడు తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

టాలీవుడ్ కి చెందిన ఓ భారీ నిర్మాణ సంస్థ ప్రస్తుతం ఆదిత్య ధర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక ఈ సినిమా లాక్ చేసేందుకు ఇద్దరు బిగ్ స్టార్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ సదరు నిర్మాణ సంస్థ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరితో ఆదిత్య ధర్ కాంబినేషన్ ని లాక్ చేయాలని చూస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్. మరి ఈ ఊహించని కలయిక ఉంటుందో లేదో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు