యాక్షన్ సినిమాల లవర్స్‌కు జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అదిరిపోయే న్యూస్ చెప్పాయి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్’ (Dhurandhar) మళ్లీ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘దురంధర్ ద రివేంజ్’ మార్చి 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆడియన్స్‌ను మరోసారి ఆ యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లేందుకు మొదటి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో 250 స్క్రీన్లలో మార్చి 12 (ఈరోజు) నుంచి, ఓవర్సీస్‌లో మరో 250 థియేటర్లలో మార్చి 13 నుంచి ఈ సినిమా సందడి చేయబోతోంది.
ఓవర్సీస్‌లో రేర్ రికార్డ్
ఇండియాలో సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేయడం ఇప్పుడు చాలా కామన్. కానీ, ఒక హిందీ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ స్థాయిలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా అరుదు. ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు 185 స్క్రీన్లలో ‘దురంధర్’ ప్రదర్శితం కావడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనం. ఫస్ట్ పార్ట్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేసి, ఆ వెంటనే సీక్వెల్ చూసే అవకాశం రావడం ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.
ఇక సీక్వెల్ ‘దురంధర్ ద రివేంజ్’ కోసం మేకర్స్ భారీ ప్లాన్ వేశారు. గ్లోబల్ రిలీజ్‌కు ఒకరోజు ముందే, అంటే మార్చి 18న అమెరికా, కెనడాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్లు, డాల్బీ అట్మాస్ లాంటి హై-ఎండ్ టెక్నాలజీతో హాలీవుడ్ రేంజ్‌లో ఈ షోలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల టికెట్లు సోల్డ్-అవుట్ అవ్వడం ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఉన్న అంచనాలను స్పష్టం చేస్తోంది.
ఉగాది కానుకగా ఐదు భాషల్లో..
ఆదిత్య ధర్ అద్భుతమైన విజన్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాను జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా మార్చి 19, 2026న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతుండటంతో, సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
