పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ దూకుడు.. ట్రెండింగ్‌లో ఇండియన్ స్పై మూవీ..!

Dhurandhar

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా అక్కడ కూడా రికార్డులను సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాకిస్థాన్ నేపథ్యంలో సాగే స్పై స్టోరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా కథ కారణంగా ఈ మూవీ పాకిస్థాన్ మరియు గల్ఫ్ దేశాలలో రిలీజ్ కాలేదు. అయితే, జనవరి 30, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఈ చిత్రం సరిహద్దులు దాటి సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. కేవలం రెండు రోజుల్లోనే ‘తేరే ఇష్క్ మే’, ‘హక్’ వంటి బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి అక్కడ టాప్ పొజిషన్‌కు చేరుకుంది. అక్కడి ప్రేక్షకులు కూడా ఈ చిత్రంలోని మేకింగ్ మరియు నటీనటుల పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ భారీ విజయం ఇచ్చిన ఊపుతో మేకర్స్ ఇప్పటికే సీక్వెల్‌ను సిద్ధం చేశారు. ‘ధురంధర్: ది రివెంజ్’ పేరుతో రాబోతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్ మాధవన్, సంజయ్ దత్ మరియు అర్జున్ రామ్‌పాల్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

Exit mobile version